: `మెలుహా` ఆధారంగా తెరకెక్కుతున్న కథలో హీరో హృతిక్?
ప్రముఖ రచయిత అమీశ్ త్రిపాఠి రాసిన మెలుహా పుస్తకాల గురించి అందరికీ తెలుసు. శివుని నేపథ్యంలో సాగే ఈ నవలా సిరీస్‌లో మొదటి భాగమైన `ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా`ను `శుద్ధి` పేరుతో తెరకెక్కించాలని అప్పట్లో నిర్మాత కరణ్ జొహార్ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఇదే ప్రాజెక్టును సంజయ్ లీలా భన్సాలీ చేపట్టబోతున్నారని సమాచారం. అందులో శివుని పాత్రకు హృతిక్ రోషన్‌ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతిల ప్రేమ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాక మెలుహా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తారని సమాచారం. మెలుహాలకు, చంద్ర వంశీయులకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. నవలలో ఉన్న కథనాన్ని బట్టి చూస్తే ఈ సినిమా కోసం పెద్ద పెద్ద సెట్టింగులు వేయాల్సివస్తుంది. అలాంటి సినిమాలు తీయడానికి సంజయ్‌లీలా భన్సాలీ సరిగ్గా సరిపోతాడని బాలీవుడ్‌లో టాక్.