: కత్రినాకు స‌ల్మాన్ బ‌ర్త్‌డే గిఫ్ట్‌... అంద‌రి స‌మ‌క్షంలో ముందే ఇచ్చేశాడు!


జూలై 16 - బాలీవుడ్ క‌త్రినా కైఫ్ పుట్టిన‌రోజు. ఇంకా రెండు రోజులుంది. అప్ప‌టి వ‌ర‌కు స‌ల్మాన్ ఖాన్ ఆగ‌లేక‌పోయాడు. నిన్న ఐఫా 2017 మొద‌టి రోజు వేడుక‌లోనే ఆమెకు గిఫ్ట్ ఇచ్చేశాడు. అంద‌రి ముందు క‌త్రినా కోసం `హ్యాపీ బ‌ర్త్ డే` పాట పాడాడు. పైగా త‌న‌కు క‌త్రినా పుట్టిన రోజు తేదీ త‌ప్ప వేరే తేదీ ఏదీ గుర్తులేద‌ని, జూలై 16 భార‌త‌దేశంలో జాతీయ వేడుక అని, త్వ‌ర‌లో అమెరికా కూడా ఈ రోజును వేడుక‌లా జ‌రుపుకుంటుందేమోన‌ని త‌న బెస్ట్ ఫ్రెండ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తేశాడు స‌ల్మాన్‌. జూలై 16న క‌త్రినా 34వ పుట్టిన‌రోజు జ‌రుపుకోబోతోంది.

  • Loading...

More Telugu News