: 'పటేల్ సర్'పై రాజమౌళి స్పందన ఇది!
జగపతిబాబు నటించిన తాజా చిత్రం 'పటేల్ సర్'పై రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. పటేల్ సర్ గా ఆయన అంకితభావంతో పని చేశారని కితాబిచ్చారు. దర్శకుడికి అది తొలి చిత్రమే అయినా, ఎంతో నైపుణ్యమున్న డైరెక్టర్ గా ఈ ప్రాజెక్టును డీల్ చేశాడని పొగిడారు. కాగా, ఇటీవలి కాలంలో విలన్, క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న జగపతి బాబు, హీరోగా నటించగా, ఈ చిత్రం నేడు విడుదలైన సంగతి తెలిసిందే. పలు హిట్ చిత్రాలను అందించిన వారాహి స్టూడియోస్ పై దీన్ని సాయి కొర్రపాటి నిర్మించగా, పరిమి వాసు దర్శకుడిగా పరిచయమయ్యాడు.