: నోటీసులు నాకెందుకిచ్చారో నాకే అర్థం కావడం లేదు.. నేను అప్పుడప్పుడు వైన్ మాత్రమే తీసుకుంటా: నటుడు సుబ్బరాజు


డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు అందిన మాట నిజమేనని సినీ నటుడు సుబ్బరాజు తెలిపాడు. నోటీసులో 21వ తేదీన తనను విచారణకు హాజరుకావాలని కోరారని చెప్పాడు. అయితే, తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో అనే విషయం తనకే అర్థం కావడం లేదని అన్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని... అప్పుడప్పుడు వైన్ మాత్రమే తీసుకుంటానని తెలిపాడు.

కెల్విన్ అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని, అతని ఫోన్ లో తన నెంబర్ ఎందుకుందో కూడా తనకు తెలియదని చెప్పాడు. తన తప్పు లేదనే విషయాన్ని తాను నిరూపించుకుంటానని, అందుకే తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని తెలిపాడు. ఎక్సైజ్ ఆఫీసుకు విచారణ కోసం రమ్మని నోటీసులో పేర్కొన్నారని... తాను, కచ్చితంగా విచారణకు హాజరై తన వాదన వినిసిస్తానని సుబ్బరాజు చెప్పాడు. 

  • Loading...

More Telugu News