: సంచలనం... 'డ్రగ్స్' నోటీసులు అందుకున్న వారిలో హీరో రవితేజ కూడా!
డ్రగ్స్ దందాపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ప్రారంభించిన విచారణలో భాగంగా, ఇప్పటికే పలువురు ప్రముఖులకు నోటీసులు వెళ్లగా, తాజాగా హీరో రవితేజకూ నోటీసులు వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రవితేజను కూడా 19వ తేదీ నుంచి వారం రోజుల్లోగా విచారణకు రావాలని కోరినట్టు తెలిపాయి. కాగా, రవితేజ సోదరుడు, ఇటీవల మరణించిన భరత్ పేరు కెల్విన్ కాల్ లిస్టులో ప్రముఖంగా కనిపించిందని సమాచారం. ఇక స్వయంగా రవితేజ కస్టమర్ గా ఉండి డ్రగ్స్ వాడడం వల్ల, ఈ నోటీసులు ఇచ్చారా? లేక తమ్ముడి డ్రగ్స్ వాడకంపై మరింత సమాచారం కోసం విచారించనున్నారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది.