: నన్ను ‘రాక్ స్టార్’ అంటే ఆశ్చర్యపోయా: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా


ఆసీస్ మాజీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తనను ‘రాక్ స్టార్’గా అభివర్ణించిన ఓ సంఘటనను టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గుర్తుచేసుకున్నాడు. రవీంద్ర జడేజాను మీడియా పలకరించిన సందర్భంలో ‘రాక్ స్టార్’ విషయాన్ని ప్రస్తావించాడు. ‘షేన్ వార్న్ ని నేను మొట్టమొదటిసారి కలిసినప్పుడు, టెస్టు క్రికెట్ లో ఆయన గొప్ప బౌలర్ అనే విషయం నాకు తెలియదు. షేన్ వార్న్ నన్ను ‘రాక్ స్టార్’ అని పిలిచారు. అయితే, నేను పాటలు పాడను, డ్యాన్స్ చేయను. కానీ, నన్ను ‘రాక్ స్టార్ ’ అన్నారేంటా అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నా మిత్రుల్లో ఒకరితో ఈ విషయాన్ని ప్రస్తావించగా, ‘నీ ముఖానికి జింక్ (క్రికెటర్లు ముఖానికి రాసుకునే స్పోర్ట్స్ క్రీమ్) బాగా పట్టించి ఉంటావు. అందుకే ఆయన అలా అన్నాడు’ అని అనడంతో నవ్వుకున్నాం. ఆ తర్వాత నా స్కిల్స్ ను (బ్యాటింగ్/ బౌలింగ్) డెవలప్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను’ అని జడేజా చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News