: పొలాల్లో ట్రాక్టర్ నడిపిన బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్!
తమ సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడంలో సెపరేటు రూటులో వెళ్లే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇటీవలే ఓ బస్సు ఎక్కి అందులో హంగామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్‌లోని లూథియానాలో షారుఖ్ ట్రాక్టర్ నడిపాడు. ప్రస్తుతం ఆయన హీరోగా రూపుదిద్దుకున్న 'జబ్ హ్యారీ మెట్ సెజల్' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే షారుఖ్ ఇలా ట్రాక్టర్‌ను నడుపుతూ పోజులిచ్చాడు. పంట పొలాల మధ్య నుంచి ట్రాక్టర్ నడిపి, తన అభిమానులకు హాయ్ చెబుతూ ఆకర్షించాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన అనుష్క శర్మ నటించింది.