: ‘ఎనీథింగ్ గోస్ రాంగ్.. ఎక్స్ ట్రీమ్ లీ సారీ అమ్మా’ : ఎమ్మెల్యే శంకర్ నాయక్


నిన్న జరిగిన హరితహారం కార్యక్రమంలో మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనాతో అవమానకర రీతిలో ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయిన అనంతరం, ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ నాయక్ ను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నిన్న మేము భోజనానికి కూర్చునే ముందు.. ‘కలెక్టర్ కు నీ చెయ్యి తగిలిందట.. ఆమె హర్టయిందట’ అని మంత్రి చందూలాల్ గారు నాతో అన్నారు.

'నాకైతే తెలియదు సార్.. పొరపాటున నా చెయ్యి కలెక్టర్ గారికి తాకిందేమో' అని చెప్పాను. ఆ తర్వాత మంత్రి గారు కొత్తగూడెం ప్రోగ్రామ్ కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మంత్రి చందూలాల్ గారు, ఎంపీ సీతారామ్ నాయక్ గారు వచ్చి.. కలెక్టర్ వద్దకు వెళ్దామని అనడంతో అక్కడికి వెళ్లాం. ‘ఎనీథింగ్ గోస్ రాంగ్ ఎక్స్ ట్రీమ్ లీ సారీ అమ్మా. నువ్వు నా సోదరి లాంటిదానివి, నీ మీద నాకు ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. మీరు ఒక ఎస్టీ కలెక్టర్.. నేను కూడా ఒక ఎస్టీ ఎమ్మెల్యేను’ అని చెప్పాను. ఆమె కలెక్టర్ గా వచ్చిన తర్వాత రెండు, మూడు సార్లు ఆమెతో మాట్లాడి ఉండొచ్చు. అదీ కూడా మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్స్ గురించి’ అని అన్నారు.  

  • Loading...

More Telugu News