: ఒకప్పుడు బాలకృష్ణతో సినిమా తీయాలనుకున్న జగన్!
వైసీపీ అధినేత జగన్ ఒకప్పుడు నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. బాలయ్య అభిమాన సంఘానికి జగన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన రోజులు కూడా ఉన్నాయి. బాలయ్య మీద ఉన్న అభిమానంతో 2003లో నిర్మాతగా మారి ఆయనతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీయాలని జగన్ ప్లాన్ చేశారట. అయితే అప్పటికే వైయస్, చంద్రబాబుల మధ్య రాజకీయ పరంగా విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో... జగన్ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదట.
అలా జగన్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆయన కల నెరవేరలేదు. ఇప్పటికీ జగన్ కు బాలయ్య అంటే అభిమానమే. రాజకీయాల పరంగా ఇద్దరివీ వేర్వేరు పార్టీలు అయినా... అభిమానానికి మాత్రం అవి అడ్డంకిగా మారలేదు. అసెంబ్లీలో సైతం వీరిద్దరూ విమర్శలు చేసుకోరు. ఓ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో జగన్ మాట్లాడుతూ... బాలయ్య చాలా హుందాగా ఉంటారని, ఎవరిపై ఎలాంటి విమర్శ చేయరని అనడం గమనార్హం.