: 'బిగ్‌బాస్' కు వ్యాఖ్యాతగా ఉండొద్దంటూ జూనియర్ ఎన్టీఆర్ కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వినతి!


ఈ నెల 16 నుంచి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న‘బిగ్ బాస్’ షో స్టార్ మా టీవీ ఛానెల్ లోప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఓ విజ్ఞప్తి చేశారట. ‘బిగ్ బాస్’ లో పాల్గొనే వ్యక్తులు, వ్యవహారాలు వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉన్నందున, ఈ షో నుంచి  జూనియర్ ఎన్టీఆర్ తప్పుకుంటే మంచిదని చెప్పారట. సీనియర్ ఎన్టీఆర్ కు, అలాగే, జూనియర్ ఎన్టీఆర్ కు తాను అభిమానినని, వాళ్ల పేర్లు వివాదాల్లో చిక్కుకోవడానికి తాను ఇష్టపడనని ఆయన అన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News