niveda thomas: పవన్ సినిమాకు 'నో' చెప్పిన నివేదా థామస్.. ఎందుకంటే...!


టాలీవుడ్లో పవన్ కల్యాణ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సాధారణ ప్రేక్షకుల్లోనే కాదు .. చిత్ర పరిశ్రమలోను ఆయనకి ఎంతోమంది అభిమానులు వున్నారు. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం కథానాయికలు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటిది నివేదా థామస్ మాత్రం 'నో' చెప్పవలసి వచ్చిందట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది.

 ప్రస్తుతం త్రివిక్రమ్ ..పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం నివేదా థామస్ ను అడిగారట. అయితే కథానాయికగా నిలదొక్కుకుంటోన్న సమయంలో చెల్లెలి పాత్ర చేయడం సరికాదని భావించి, సున్నితంగా తిరస్కరించానని అంది. అలా చెప్పవలసినందుకు .. పవన్ సినిమాను వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పింది. పవన్ జోడీగా నటించే ఛాన్స్ త్వరలోనే వస్తుందనే నమ్మకం మాత్రం బలంగా వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  

niveda thomas
  • Loading...

More Telugu News