: తెల్లవారుజామున కూయాల్సిన కోడి.. రాత్రి పది గంటలకే కూస్తే అనర్థం!: జగన్ పై కళా వెంకట్రావు సెటైర్


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పదవీ వ్యామోహాన్ని తగ్గించుకుంటే మంచిదని, తండ్రి నీడలో లక్ష కోట్లు వెనకేసుకున్న ఆయన సీఎం కావాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. తెల్లవారుజామున కూయాల్సిన కోడి, రాత్రి పది గంటలకే కూస్తే అనర్థమని, అలాగే, రెండేళ్ల ముందే సీఎం అయిపోతానని ప్రకటించే ఉబలాటం ఎందుకో? అంటూ జగన్ పై సెటైర్లు విసిరారు. కాంగ్రెస్ నాయకత్వానికి వయసు మీరిపోయిందని, డీలిమిటేషన్ ను అడ్డుకుంటే ఆ పార్టీకి నూకలు చెల్లిపోతాయని, సుస్థిర ప్రభుత్వం కోసం నియోజకవర్గాల పునర్విభజన అవసరమని అన్నారు. 

  • Loading...

More Telugu News