: ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు.. పాల్గొంటే కేసుల్లో ఇరుక్కుంటారు!: డీజీపీ సాంబశివరావు హెచ్చరిక
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టనున్న ‘ఛలో అమరావతి’కి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పాదయాత్రలో ఎవరూ పాల్గొనవద్దని, కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన హెచ్చరించారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలకు పోలీస్ అనుమతి తప్పనిసరి అని, కోస్తా జిల్లాల్లో సెక్షన్ 140, 30 ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 26న పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఇది నిరవధిక పాదయాత్ర అని ముద్రగడ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో 13 జిల్లాల కాపు నేతలు ఏకమవ్వాలని ముద్రగడ పిలుపు నిచ్చారు.