: ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీసం పోయిందన్న బాధలో బాలీవుడ్ హీరో


బాలీవుడ్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గా యంగ్ హీరో రణవీర్ సింగ్ ను పేర్కొనచ్చు. అతని మీసం, గడ్డం ఓ ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయాయనడంలో సందేహం లేదు. గతంలో 'బాజీరావ్' సినిమా కోసం రణవీర్ మీసాలు పెంచాడు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'పద్మావతి' సినిమా కోసం గడ్డం, మీసాలు పెంచాడు. ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను రణవీర్ పోషిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవడంతో... తాజాగా గడ్డం, మీసాలను ట్రిమ్ చేయించాడు. ఈ సందర్భంగా మీసం పోయిన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ట్రిమ్ చేయించుకుంటున్న వీడియోను కూడా షేర్ చేశాడు.  

  • Loading...

More Telugu News