: రేపు ప్రతిపక్ష నేతలతో కేంద్ర మంత్రుల భేటీ.. భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులపై చర్చ


భారత్‌, చైనా, భూటాన్‌ సరిహద్దులో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చ‌ర్చించ‌డానికి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం రేపు స‌మావేశం ఏర్పాటు చేయ‌నుంది. కేంద్ర హోంశాఖ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో ఏర్పాటు చేయ‌నున్న‌ ఈ సమావేశంలో రాజ్ నాథ్ తో పాటు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్ర‌తిప‌క్ష నేత‌ల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రిస్తారు. ఈ భేటీలో పాల్గొనాల‌ని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీయూ, లెఫ్ట్‌ పార్టీలకు చెందిన నేత‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరిన‌ట్లు తెలుస్తోంది. డోక్లామ్‌లో ఇటువైపు నుంచి భార‌త్‌, అటువైపు నుంచి చైనా దళాలు మోహ‌రించిన విష‌యం తెలిసిందే. చైనా త‌న తీరును ప్ర‌ద‌ర్శిస్తూ భార‌త్‌దే త‌ప్ప‌ని, అక్క‌డి నుంచి భార‌త సైనికులు వెళ్లిపోవాల‌ని తాజాగా మ‌రోసారి సూచించింది.

  • Loading...

More Telugu News