: అరుదైన శస్త్రచికిత్స... కాలి బొటన వేలును తీసి.. చేతికి పెట్టిన వైద్యులు!
దురదృష్టవశాత్తూ చేతి బొటనవేలుని కోల్పోయిన ఓ యువకుడికి ఆస్ట్రేలియా వైద్యులు చికిత్స చేసి అతడి కాలి బొటన వేలును తీసి చేతికి పెట్టారు. పశువుల కాపరి అయిన జాక్ మిచెల్ (20) పెర్త్‌లో నివసిస్తుంటాడు. ఇటీవల ఓ ఎద్దు వేగంగా దూసుకొచ్చి అతడిని గాయపర్చింది. ఈ ఘటనలో అతడి కుడి చేతి బొటన వేలు ఊడిపోయింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా ఊడిపోయిన ఆ బొటనవేలుని అతికించడానికి వీలుకాలేదు. దీంతో వైద్యం కోసం సిడ్నీకి వెళ్లిన ఆ యువకుడికి డాక్టర్లు ఓ సూచన చేశారు. కుడి కాలి బొటన వేలును తీసి చేయికి అతికించే అవకాశం ఉందని వారు అన్నారు. దానికి మిచెల్ అంగీకరించడంతో వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆ యువకుడి కాలి బొటనవేలును తీసి చేయి బొటన వేలు స్థానంలో అతికించారు.