: సిట్ నోటీసుల లిస్టులో ఓ సెన్సేషనల్ నిర్మాత, ఐటమ్ బాంబ్, ఓ ప్రముఖ సింగర్!
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతూ, డ్రగ్స్ దందాలో చిక్కి ప్రత్యేక దర్యాఫ్తు బృందం నుంచి నోటీసులు అందుకున్న వారికి సంబంధించిన మరిన్ని లీక్ లు వచ్చాయి. గత కొంతకాలంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఓ సెన్సేషనల్ నిర్మాత ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆపై ముంబైలో నివాసం ఉంటూ, తెలుగు చిత్రాల్లో పలు ఐటమ్ సాంగ్స్ చేసిన హాట్ బాంబ్ కు కూడా సిట్ పోలీసుల నుంచి నోటీసులు వెళ్లినట్టు సమాచారం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఆపై ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఉన్న ఓ హీరోయిన్, తన అద్భుత గానంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం రాక్ స్టార్ గా వెలుగుతున్న ప్రముఖ గాయకుడికి కూడా సిట్ నోటీసులు పంపి ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.