: కేసీఆర్ ను అశోకుడితో పోల్చిన నటుడు ఆర్.నారాయణమూర్తి!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశంసల జల్లు కురిపించారు. ఆనాడు అశోకుడు మొక్కలను నాటితే, ఇప్పుడు కేసీఆర్ కోట్లాది మొక్కలను నాటుతున్నారని కితాబిచ్చారు. వనోద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని... ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.

హరితహారం కార్యక్రమంతో యావత్ దేశానికి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా నేతలందరూ మొక్కలు నాటాలని విన్నవించారు. మొక్కలను నాటడమే కాకుండా, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఈ రోజు ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News