: సినీ జగత్తులో మత్తు... ముగ్గురు తెలుగు హీరోయిన్లకు ఈ ఉదయం సిట్ నోటీసులు


దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రమేయముందని భావిస్తున్న ముగ్గురు తెలుగు హీరోయిన్లకు సిట్ కొద్దిసేపటి క్రితం నోటీసులు పంపింది. ఎవరెవరికి నోటీసులు పంపామన్న విషయాన్ని వెల్లడించకున్నా, వీరంతా సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే పది మంది సినీరంగంలోని వారికి నోటీసులు ఇచ్చామని చెప్పిన ఆయన, నేడు ముగ్గురు హీరోయిన్లకు, మరో టాప్ డైరెక్టరుకు కూడా నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. వీరంతా 19న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుంటుందని, లేకుంటే పోలీసు చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News