: హీరో సూర్య, శరత్ కుమార్, సత్యరాజ్, శ్రీప్రియలపై కేసు కొట్టివేత


తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సూర్య, శరత్ కుమార్, సత్యరాజ్, అరుణ్ విజయ్, చేరన్, శ్రీప్రియ, వివేక్ లపై ఊటీ కోర్టులో నమోదైన కేసు నుంచి మధ్రాస్ హైకోర్టు విముక్తిని కల్పించింది. 2009లో ఓ సంతాప కార్యక్రమంలో పాల్గొన్న వీరంతా, విలేకరులను, వారి కుటుంబీకులను దూషించారని ఊటీకి చెందిన మరియకుసై అనే రిపోర్టర్ కేసు వేయగా, దాన్ని హైకోర్టు కొట్టేసింది. గతంలో ఊటీ కోర్టుకు విచారణకు రావాలని వీరందరికీ తాఖీదులు పంపినా, వీరు రాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఆపై వీరంతా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత వారెంట్లను నిలుపుదల చేసిన న్యాయస్థానం, ఆపై కేసును విచారించి, దాన్ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News