: ఇంతకు మించిన అదృష్టం ఆమెను తప్ప మరెవరినీ వరించదేమో!


అదృష్టం ఎప్పుడు? ఎలా? ఎవర్ని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం... రోడ్డుపై వెళ్తూ సరదాగా కొన్న లాటరీ టికెట్ ఊహించని అదృష్టాన్ని తెస్తుందని రోసా డొమిన్ గుజ్ (19) కూడా ఊహించలేదు. కానీ అదృష్టం అంటే ఆమెదే అనేలా అదృష్టం ఆమెను వరించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రోసా డొమిన్‌ గుజ్ పనిమీద అర్జెంటుగా ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన లాటరీ షాప్ వద్ద ఎక్కువ మంది జనాలు ఉండడాన్ని చూసి ఆగింది.

 సరదాగా కేవలం 5 డాలర్లు పెట్టి ఒక లాటరీ టికెట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. రెండు రోజుల తరువాత కూడా అలాగే మరో టికెట్ ను కూడా కొనుగోలు చేసింది. ఈ రెండు లాటరీ టికెట్ల ఫలితాలు ఒకే వారంలో విడుదలయ్యాయి. ఈ రెండు లాటరీలు ఆమెనే వరించాయి. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం 19 ఏళ్లకే ఆమెకు లాటరీ రూపంలో 6,55,555 డాలర్లు (4,22,00,000 రూపాయలు) సొంతమయ్యాయి. దీంతో అదృష్టం తనను ఇంతలా వరిస్తుందని భావించలేదని ఆనందబాష్పాలు రాల్చింది. 

  • Loading...

More Telugu News