: ఐఎస్ఐఎస్ పట్టుకోల్పోయింది...త్వరలోనే అంతం చేస్తాం: ట్రంప్
సిరియా, ఇరాక్ లలో ఐఎస్ఐఎస్ పట్టుకోల్పోయిందని, త్వరలోనే ఆ ఉగ్రవాద సంస్థను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐఎస్ఐఎస్ ప్రధాన పట్టణమైన మోసూల్ ను ఇరాక్ సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకున్న అనంతరం... ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ మరణించాడని సాక్షాత్తూ ఆ సంస్థే ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, సిరియా, ఇరాక్ నుంచి ఐఎస్ఐఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఐఎస్ ను అంతం చేయడంతో చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటిరావడం 75 శాతం తగ్గిపోయిందని ఆయన ప్రకటించారు. ఎంఎస్ 13 గ్యాంగులను కూడా సంకీర్ణసేనలు నిర్మూలించాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీని ఫోన్ లో అభినందించారు.