Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
* 'తెలుగు సంస్కృతి ఎంత గొప్పదో తెలుగు నేర్చుకున్నాకనే నాకు అర్థమైంది' అంటోంది అందాలతార తమన్నా. "కెరీర్ ప్రారంభంలో అవసరం కోసం ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నాను. ఆ భాష ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పుడు తెలుగు సంస్కృతి ఎంత గొప్పదో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా నన్ను తెలుగమ్మాయిగానే చూస్తున్నారు. అది తెలుగు భాషకున్న గొప్పదనం" అని చెప్పింది తమ్మూ.
* 'పెళ్లిచూపులు' చిత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీత వెండితెరకు వస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫిదా' సినిమాలో ఆమె ఓ సహాయ పాత్రలో నటించారు.
* 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్ టైగర్' వంటి చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. మిత్రులతో కలసి 'కల్యాణం' పేరుతో ఓ మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు ముఖేష్ తనయుడు శ్రావణ్ ముఖేష్ ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు.
* ఈ నెల 14న విడుదల కావలసిన 'మాయామాల్' చిత్రాన్ని వాయిదా వేశారు. డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు ఈ చిత్రం విడుదలను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. గోవింద్ లాలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిలీప్, ఇషా, దీక్షా పంత్ ముఖ్య పాత్రలు పోషించారు.