: 'స్పైడర్’ సెట్లో సరదా సన్నివేశం.. కడుపుబ్బ నవ్విన మహేశ్ ను చూడండి!
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్’. ఈ చిత్రం సెట్ లో చోటుచేసుకున్న ఓ సరదా సన్నివేశం వీడియోను మురుగదాస్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈరోజు పోస్ట్ చేశారు. ‘స్పైడర్ సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో మహేశ్ బాబు సరదా సన్నివేశం’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో, అసిస్టెంట్ డైరెక్టర్ బుగ్గలను తన రెండు చేతులతో పట్టుకున్న మహేశ్ కడుపుబ్బేలా నవ్వుతూ సరదాగా కామెంట్ చేయడం కనపడుతుంది.
అంతేకాకుండా, ఈ వీడియోలో చిత్ర యూనిట్ సభ్యుల కామెంట్లు కూడా వినపడుతుండటం గమనార్హం. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ‘మా అన్న..మహేశ్ అన్న స్మైల్ చూశా’, ‘అన్నన్న ఎంత హ్యాపీగా ఉన్నావో..హ్యాపీగా ఉండాలి’,‘నీ నవ్వు వరం’,‘ ఈ వీడియో కనుల పండగ’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.