: పదేళ్ల తర్వాత తమిళ చిత్రంలో నటించనున్న జయప్రద!


ప్రముఖ సీనియర్ నటి జయప్రద సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో నటించనుంది. మలయాళ  ఫిల్మ్ మేకర్ ఎంఏ నిషాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ తమిళ చిత్రం పేరు ‘కెని’. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజల మధ్య నెలకొన్న నీటి సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.1956 లో కేరళ రాష్ట్రం ఏర్పడింది. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో ఉండే బావి తమదంటే తమదంటూ రెండు రాష్ట్రాల ప్రజలు గొడవకు దిగుతారు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించారనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.

కాగా, తమిళ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తీపన్ ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించుకునే మార్గాల కోసం అన్వేషించకుండా, గొడవలు పడటం సమంజసం కాదని ప్రజలకు తెలియజెప్పే పాత్రలో తాను నటిస్తున్నానని, ఈ చిత్రంలో జయప్రద సరసన నటిస్తుండటం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. నటుడు, డైరెక్టర్ భాగ్యరాజా గతంలో తెరకెక్కించిన ‘ఒర్ కైదియిన్ డైరీ’ చిత్రాన్ని హిందీలో 'ఆఖరీ రాస్తా'గా ఆయనే తీశారు. ఈ చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని, ఆ సమయంలో అమితాబ్ బచ్చన్, జయప్రదతో కలిసి పనిచేసిన విషయాన్ని పార్తీపన్ గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News