: హోమ్ 'బ్రాడ్ బ్యాండ్'లో సంచలనం సృష్టించనున్న జియో!
డేటా మార్కెట్లో మరో సంచలనానికి రిలయన్స్ జియో రెడీ అయిపోయింది. అతి త్వరలో ఈ సంస్థ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ప్రివ్యూ ప్లాన్ కింద తొలి మూడు నెలల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందే అవకాశాన్ని ఇవ్వనున్నట్టు సమాచారం. నెలకు 100 జీబీ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో మూడు నెలలపాటు ఇచ్చే ప్లాన్ ను సిద్ధం చేసింది. కాకపోతే ఇన్ స్టలేషన్ చార్జీ కింద ప్రారంభంలో రూ.4,500 చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ రద్దు చేసుకున్న సమయంలో ఈ మొత్తం వెనక్కి వస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగా రూటర్ ను కూడా కంపెనీ సమకూరుస్తుంది. తొలుత ఈ సేవలను హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, వదోదర నగరాల్లో ప్రారంభించనున్నట్టు సమాచారం.