: 14 ఏళ్లకే నేరస్థుడిని ఎలా అవుతాను?: కేంద్రాన్ని ప్రశ్నించిన లాలూ కుమారుడు


తనపై కక్షసాధింపు చర్యల్లో భాగమే సీబీఐ కేసుల నమోదు అని లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న 2004-2009 మధ్య కాలంలో ఐఆర్ సీటీసీ నిర్వహణలోని హోటళ్ల లీజుల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ ఇటీవలే లాలూ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తేజస్వియాదవ్ మొదటి సారి ఈ రోజు స్పందించారు.

‘‘2004 నాటికి సంబంధించి నాపై కేసులను నమోదు చేశారు. అంటే 13 లేదా 14 ఏళ్లకే నేను నేరస్థుడిని ఎలా అవుతాను? తిరిగే వయసు కూడా కాదది. ఆ వయసులో ఇటువంటివన్నీ ఎలా చేయగలను?’’ అంటూ తేజస్వియాదవ్ ప్రశ్నించారు. జేడీయూ, ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా తేజస్వి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తేజస్వి యాదవ్ 1989లో జన్మించారు. 

  • Loading...

More Telugu News