: హీరో అనిపించుకోవాలని ఈ సినిమా చేయలేదు: జగపతిబాబు
ఈ వయసులో హీరోగా నటించాలి, డ్యాన్స్‌లు, రొమాన్సులు చేయాలని `పటేల్ సార్` సినిమా చేయలేదని, కథ బాగా నచ్చిందనే చేశానని నటుడు జగపతిబాబు అన్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా బాగానే రాణిస్తున్న సమయంలో ఇలా హీరోగా నటించడంపై చాలా మంది పెదవి విరవడంపై ఆయన స్పందించారు. ఎప్పుడూ ఒకే రకం పాత్రలు వేస్తే ఎలా? అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతే జీవితం బోర్ కొడుతుందని జగపతిబాబు అన్నారు.
ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు మహిళా అభిమానులను సంపాదించుకున్న జగపతిబాబు ఒకానొక సమయంలో తనకు ఎవరూ అవకాశాలివ్వడం లేదని నిర్మొహమాటంగా చెప్పారు. ఇక బోయపాటి దర్శకత్వంలో లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఈ మధ్య కాలంలో ధనవంతుడైన తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అలాగే `పటేల్ సార్` సినిమాలో మాఫియా లుక్‌లో కనిపిస్తున్నా ఈ సినిమా మొత్తం కుటుంబ నేపథ్యంలో సాగుతుందని ఆయన చెప్పారు.