: రెండో స్థానానికి పడిపోయిన `గంగ్నమ్ స్టైల్` వీడియో
నాలుగున్నర సంవత్సరాలుగా యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన వీడియోల్లో మొదటి స్థానంలో ఉన్న `గంగ్నమ్ స్టైల్` వీడియో సోమవారం రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణ కొరియా పాప్ సింగర్ సై వినూత్నంగా వేసిన డ్యాన్స్ స్టెప్పులను జనాలు బాగా ఆదరించారు. దీంతో గత నాలుగున్నరేళ్లుగా ఈ వీడియో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు విజ్ ఖలీఫా, చార్లీ పుత్‌ల `సీ యూ ఎగైన్` వీడియో ఈ స్థానాన్ని ఆక్రమించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నటుడు పాల్ వాకర్‌కు నివాళిగా ఆ సినిమా ఏడో భాగం కోసం రూపొందించిన ఈ వీడియోను 290 కోట్ల మంది వీక్షించారు. కాగా గంగ్నమ్ వీడియోను 289 కోట్ల మంది వీక్షించారు. ఏదేమైనా గంగ్నమ్ పాట ప్రపంచాన్ని మొత్తం తనదైన స్టెప్పులతో ఒక ఊపు ఊపేసిందన్నమాట మాత్రం వాస్తవం.