: బాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసిన కాజల్
దక్షిణాదిలో చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నప్పటికీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దృష్టి మాత్రం బాలీవుడ్ పైనే ఉంది. ఇప్పటికే కొన్ని హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా మరో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. 'యామ్లా పాగల్ దీవానా-3' సినిమాలో బాబీ డియోల్ సరసన కాజల్ నటించబోతోందని సమాచారం. సన్నీ డియోల్ సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ లు నటిస్తున్నారు. 2016లో కాజల్ చివరి బాలీవుడ్ సినిమా 'దో లఫ్జోన్ కి కహాని' సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా సరసన కాజల్ నటించింది.