: దాడి స్థానంలో యనమల?
శాసనమండలి సభ్యుడిగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకూ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఉన్న దాడి వీరభద్రరావు స్థానంలో.. యనమల ఇక ప్రతిపక్షనేతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. దాడికి మరోసారి శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వలేదని అలిగి తెలుగుదేశం పార్టీని వీడిన సంగతి ఎరుకే.