: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాదులో రెండు రోజులు మద్యం బంద్
హైదరాబాదులో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు ఆగిపోనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు జంటనగరాల్లో మద్యం అమ్మకూడదని సిటీ పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేయబోతోంది.