: వెంకటేశ్ కుమార్తెతో అఖిల్ పెళ్లి?... సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!


ప్రముఖ నటుడు నాగార్జున కుమారుడు అఖిల్ కు మరో అగ్ర నటుడు వెంకటేశ్ కుమార్తెతో వివాహం జరగనుందా? అంటే సోషల్ మీడియా అవుననే చెబుతోంది. గత డిసెంబర్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ తో అక్కినేని అఖిల్ వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారి వివాహం కార్యరూపం దాల్చకుండా ఆగిపోయింది. దీంతో అఖిల్ తన సినిమాలలో పడిపోయాడు.  

మరోపక్క, అఖిల్ అన్న నాగ చైతన్య తన ప్రేయసి సమంతతో వివాహానికి సిద్ధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్ కు కూడా వివాహం చేసేయనున్నారని, వెంకటేశ్ కుమార్తెను అఖిల్ కు జోడీగా ఎంచుకున్నారని, ఈ మేరకు వెంకటేశ్ తో నాగార్జున మాట్లాడారని, గతంలో ఉన్న బంధుత్వం కారణంగా ఈ వివాహానికి ఆయన కూడా అంగీకరించారని సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

అయితే ఇందులో వాస్తవం ఎంత? అనేది ఇరు కుటుంబాల్లో ఎవరైనా స్పందిస్తే కానీ నిర్ధారణ కాదు. కాగా, సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయని, ఇందులో వాస్తవమెంతుందో తెలియదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  

  • Loading...

More Telugu News