: కర్ణాటక ఆర్టీసీ బస్సు సిబ్బంది కిరాతకం.. నడుస్తున్న బస్సులో 15 ఏళ్ల బాలికపై కండక్టర్, ముగ్గురు డ్రైవర్లు సామూహిక అత్యాచారం


కర్ణాటకలో మరో అమానవీయ ఘటన జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఇంటికి వెళ్తున్న 15 ఏళ్ల బాలికపై ముగ్గురు డ్రైవర్లు, కండక్టరు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉడిపికి చెందిన బాలిక రణబెన్నూరు నుంచి ఇంటికి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. నార్త్‌వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్ల్యూకేఆర్‌టీసీ) అధికారులు మంగళవారం నలుగురినీ సస్పెండ్ చేశారు. ఈ ఘటన జూలై 5న జరిగినట్టు పోలీసులు తెలిపారు.

బాధిత బాలిక తల్లిదండ్రులు రోజు వారీ కార్మికులు. బెల్గావీకి చెందిన వారు ఉడిపిలో స్థిరపడ్డారు. ఘటన తర్వాత బాలిక షాక్‌లోనే ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని వివరించిందని, వెంటనే బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను రాణిబెన్నూరు డిపోకు చెందిన కండక్టర్ రఘు బడిగర్ (35), హైరెకర్ డిపోకు చెందిన డ్రైవర్లు వీఆర్ హైరెమత్ (45), వీసీ కట్టిగర్ (45)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News