: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న నేవీ ఉద్యోగి... లక్షన్నర కాజేసిన నిందితులు!


నేవీ అధికారి ఒకరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడడం కలకలం రేపుతోంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, పిన్ నెంబర్ చెప్పాలంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారంటూ ప్రతిరోజు మీడియా, పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. అయినప్పటికీ విద్యావంతులు కూడా వారి బారిన పడి మోసపోవడం విశేషం. తాజాగా వైజాగ్ లో నేవీలో పని చేసే సింహాద్రి అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటీపీ నెంబర్ చెప్పి లక్షన్నర కోల్పోయాడు. దీంతో ఆయన పోలీసులుకు ఫిర్యాదు చేయగా, పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ లో ఉన్న మహ్మద్ జువాద్ అలా నిందితుడని నిర్ధారించి, అతనిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News