: మోసుల్‌ను కోల్పోయిన ఐఎస్... ఇప్పుడు మరో గ్రామంపై పట్టు సాధించింది!


ఇరాక్ సేనల చేతిలో ఓటమి తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరో గ్రామంపై క్రమంగా పట్టు బిగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఆర్మీ ఆధికారి తెలిపారు. గెరిల్లా శైలిలో గ్రామంలో మోహరించిన ఉగ్రవాదులు గ్రామాలపై పట్టుపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు దక్షిణ మోసుల్‌లోని ఇమామ్ ఘర్బి ప్రాంతంలో 75 శాతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, గతవారమే ఈ గ్రామంపై ఐఎస్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఇరాకీ దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య ఇంకా భీకర పోరు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. మంగళవారం ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై హెలికాప్టర్ దాడులు జరిగాయని చెబుతున్నారు. కాగా, మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై విజయం సాధించామని, ఇదో చారిత్రక విజయమని ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాదీ సోమవారం ప్రకటించారు.

  • Loading...

More Telugu News