: ఖండాంత‌ర క్షిప‌ణి ప‌రీక్ష‌ విజ‌య‌వంతమైనందుకు... పండుగ చేసుకున్న ఉత్తరకొరియా


ఉత్త‌ర‌కొరియా మరోసారి దుస్సాహసానికి పాల్పడి ఖండాంత‌ర క్షిప‌ణి ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఉత్త‌ర‌కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సంతోషానికి అవ‌ధులు లేకుండాపోతున్నాయి. ఈ స‌క్సెస్‌ను ఆయ‌న ఫుల్లుగా ఎంజాయ్ చేశార‌ట‌.  

 ఖండాంతర క్షిపణిని తయారు చేసేందుకు కృషి చేసిన వారందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చి హ‌ర్షం వ్య‌క్తం చేశార‌ట‌. ఉత్తరకొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్ర‌చురించిన వివరాల ప్ర‌కారం... కన్సర్ట్‌లో సాంగ్‌ ఆఫ్‌ హ్వాసంగ్‌ రాకెట్‌, మేక్‌ అదర్స్‌ ఎన్వీ అజ్‌ అనే గీతాలను కూడా ఆ పార్టీలో పాడుకుని, డ్యాన్స్ చేశారు. కిమ్ జోంగ్ ఉన్ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇలా పార్టీ ఇచ్చారు. ఉత్త‌ర‌కొరియా ఈ నెల 4న ఈ ప్ర‌యోగం చేసింది.

  • Loading...

More Telugu News