: హీరో దిలీప్ ను బహిష్కరించిన మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్!


మలయాళ నటి భావనపై లైంగిక వేధింపులు, దాడి కేసులో నటుడు దిలీప్ ను కేరళ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిలీప్ ను అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) బహిష్కరించింది. ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నివాసంలో కమిటీ సభ్యులు ఈ రోజు అత్యవసర సమావేశమయ్యారు. దిలీప్ కు ‘అమ్మ’ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, కోశాధికారి పదవి నుంచి కూడా ఆయన్ని తొలగించినట్టు మీడియాకు తెలిపారు. అదేవిధంగా, కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ కూడా దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News