: టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి.. జాతీయ మీడియాలో కథనాలు!


టీమిండియా హెడ్ కోచ్ నియామకంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. హెడ్ కోచ్ పదవిలో రవిశాస్త్రిని నియమించినట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 2019 వరల్డ్ కప్ క్రికెట్ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, రవిశాస్త్రి క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే.. 1981-92 వరకు భారతజట్టుకు రవిశాస్త్రి ప్రాతినిధ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్ లు ఆయన ఆడారు. టెస్టుల్లో 3,830, వన్డేల్లో 3,108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. 2014-16లో టీమ్ డైరెక్టర్ గా రవిశాస్త్రి పనిచేశారు.

  • Loading...

More Telugu News