: హైదరాబాద్ లో అతి వేగంతో వచ్చి డివైడర్ ను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వచ్చిన ఓ కారు బంజారాహిల్స్ రోడ్ నెంబరు 3లోని ఓ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియలేదు. కారు నెంబరు ఆధారంగా వారి వివరాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.