: చిరంజీవి స్థాయిని మేము తగ్గించ లేదు: దిల్ రాజు
అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో, నిర్మాత దిల్ రాజు కార్యాలయం వద్ద మెగా అభిమానులు నిన్న ఆందోళన చేశారు. చిరంజీవి సినిమా 'ఖైదీ నంబర్ 150' కంటే ఎక్కువ కలెక్షన్లు 'డీజే'కు వచ్చాయని దర్శకనిర్మాతలు ప్రకటిస్తున్నారంటూ మెగా అభిమానులు గొడవ చేశారు. కలెక్షన్లకు సంబంధించిన లెక్కలను చూపించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో దిల్ రాజు స్పందించారు. కావాలనే కొందరు వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చిరంజీవి రేంజ్ చాలా ఎక్కువని... ఆయన రేంజ్ ఎన్నటికీ తగ్గదని చెప్పారు. చిరంజీవి సినిమాకి, డీజే సినిమాకు పోలిక పెట్టడం మంచిది కాదని చెప్పారు. చిరంజీవి వల్లే పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అంతా వచ్చారని అన్నారు. కేవలం ఒక మనిషి వల్లే ఇంత మంది వచ్చారని... చిరంజీవిని తలచుకోకుండా ఏ ఫంక్షన్ కూడా జరగదని చెప్పారు.