: 'అయ్యో! మనం కలవలేకపోయాం... ఈ సారి కలిసినప్పుడు డీల్ మాట్లాడుకుందాం' అంటున్న ఇంగ్లండ్ పోలీసులు


గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి ఇంగ్లండ్ పోలీసులు ఆసక్తికరమైన ఆహ్వానం పలికారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫార్డ్ లోని ఓ తోట‌లో గంజాయిని గుట్టుగా సాగుచేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ తోటలోకి సిబ్బందితో వెళ్లిన పోలీసులు, గంజాయి మొక్కలన్నీ పీకేసి, తగులబెట్టేశారు. తరువాత ఆ సాగు చేసిన వ్యక్తి కోసం గాలించారు. పోలీసుల రాక గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి ముందే ఉడాయించాడు.

దీంతో పోలీసులు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోకుండా....ఒక నోట్ రాసి అక్కడున్న చెట్టుకి కట్టారు. ఆ నోట్ లో... "ఉప్స్.. మ‌నం క‌ల‌వ‌లేక‌పోయాం.. సారీ.. కాని.. 101 కి కాల్ చేయండి.. మ‌నం డీల్ డిస్క‌స్ చేద్దాం.. ప్రేమ‌తో" అంటూ రాశారు. అనంతరం దానిని ఫోటో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో పోలీసుల ఆలోచనను అంతా అభినందిస్తున్నారు. పోలీసులు వినూత్నంగా ఆలోచించారని పలువురు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News