: ప్రియాంక వస్త్రధారణపై ప్రధానికి ఎలాంటి అభ్యంతరం లేదు: ప్రియాంక తల్లి మధు చోప్రా
బెర్లిన్‌లో ప్రధాని నరేంద్రమోదీని మోకాళ్ల వరకు కనిపించే వస్త్రధారణతో వెళ్లి కలిసిన ప్రియాంక చోప్రాపై సోషల్ మీడియా వేదికగా సంప్రదాయవాదులు విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. వారికి తగ్గట్టుగా ప్రియాంక కూడా మరో ఫొటోను పోస్ట్ చేసి ఘాటుగా సమాధానం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రియాంక అలా వెళ్లడానికి గల కారణాలను ఇటీవల ఆమె తల్లి మధు చోప్రా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
నిజానికి ప్రియాంక ఆరోజు ప్రధానిని కలవడం ముందే ప్లాన్ చేసుకున్నది కాదట, ఏదో అకస్మాత్తుగా జరిగిపోయిందని మధు తెలిపారు. ఆ తక్కువ సమయంలో చీరలోకి మారే సమయం లేదని, ఆ విషయం గురించి ప్రధాని ప్రోటోకాల్ ప్రతినిధిని కలవగా వస్త్రధారణపై ప్రధానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతోనే ప్రియాంక అలా వెళ్లి కలిసిందని మధు చోప్రా వివరించారు.