: భావనపై లైంగిక దాడికి కారణం దిలీప్ అని అందరికీ తెలుసు... కానీ ఎవరూ ముందుకు రాలేదు: దర్శకుడి సంచలన ఆరోపణ
ప్రముఖ సినీ నటి భావనపై జరిగిన లైంగిక దాడికి కారణం మలయాళ స్టార్ హీరో దిలీప్ అన్న సంగతి అందరికీ తెలుసని ప్రముఖ డైరెక్టర్ విజయన్ సంచలన ఆరోపణ చేశారు. దిలీప్ అరెస్టైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను దిలీప్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని అన్నారు. ఫిల్మ్ అసోసియేషన్ లో ప్రధానమైన వ్యక్తిగా ఉన్న దిలీప్ ను తొలగించేందుకు కానీ, అతనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు కానీ మలయాళ చిత్ర పరిశ్రమలోని పెద్దలెవరూ ధైర్యం చేయలేరని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
అందుకే భావనపై జరిగిన లైంగిక దాడి వెనుక దిలీప్ ఉన్నాడని సినీ పరిశ్రమ మొత్తానికి తెలిసినా, అతనికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే బాధిత నటికి అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. భావన తన గుప్పిట్లోకి రావడం లేదనే కక్షతోనే దిలీప్ ఇదంతా చేయించాడని ఆయన స్పష్టం చేశారు.