: రెండేళ్ల నాటి ఆనందపు క్షణాలను గుర్తు చేసుకున్న ప్రభాస్!
తన సినీ చరిత్రలో అతిపెద్ద చిత్రంగా నిలిచిన 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన అభిప్రాయాలను, ఆనందాన్ని ఫేస్ బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు ప్రభాస్. "నేటితో బాహుబలి విడుదలై రెండు సంవత్సరాలు అయింది. ఇది నాకెంతో ప్రత్యేకం. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయి. టీమ్ మొత్తం ఎంతో ఇష్టపడి పని చేసింది. ఈ సందర్భంగా నా అభిమానులందరికీ ధన్యవాదాలు. చిత్రం కోసం ఎన్నో ఏళ్లు కష్టపడిన టీమ్ కు అభినందనలు. ముఖ్యంగా మా వెనకుండి నడిపించిన ఎస్ఎస్ రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని చెప్పాడు.