: అమెజాన్ ప్రైమ్ డే డీల్: రూ. 43వేల‌కే ఆపిల్ ఐఫోన్‌7.... ఇంకా ఎన్నో...!


సోమ‌వారం సాయంత్రం ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్ సేల్‌లో ఆఫ‌ర్ల వ‌ర్షం కురుస్తోంది. ఇంకా కొన్ని గంట‌లే ఉండే ఈ ఆఫ‌ర్‌లో ఆపిల్ ఐఫోన్‌7ను రూ. 42,999కే అందిస్తున్నారు. అలాగే ఐఫోన్ 6ఎస్‌, ఐఫోన్ 6, ఆపిల్ వాచ్‌ల‌పై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. ఇవి సొంతం చేసుకోవాలంటే రూ. 499 చెల్లించి అమెజాన్ ప్రైమ్‌లో సంవ‌త్స‌ర స‌భ్య‌త్వం తీసుకోవాల్సిందే. ఇప్పుడు తీసుకోవ‌డ‌మే శ్రేయ‌స్క‌రం. ఎందుకంటే వ‌చ్చే ఏడాది నుంచి ఈ మెంబ‌ర్‌షిప్ ధర రూ. 999కి పెర‌గుతుంద‌ని స‌మాచారం. ఆపిల్ ఫోన్ల‌పైనే కాకుండా సామ్‌సంగ్ వ‌న్‌5, వ‌న్‌ప్ల‌స్‌5 ఫోన్ల‌పై కూడా ఆఫ‌ర్లు ఉన్నాయి. వీటితో పాటు కొనుగోళ్ల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, ఎక్స్చేంచ్ ఆఫ‌ర్లు కూడా ఈ సేల్‌లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News