: కేంద్ర ఉద్యోగులకు కుటుంబ నియంత్రణ అలవెన్స్ రద్దు!


కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు ఇకపై కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలను పొందలేరు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు చేయగా, వాటిని మోదీ సర్కారు ఆమోదించింది. దీంతో పాటు నెలవారీ ఇచ్చే పలు రకాల అలవెన్స్ లను రద్దు చేయడం లేదా సమీక్షించడం చేయాలని ఈ కమిటీ కేంద్రానికి వెల్లడించింది. గత నెలలో ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలోనే వివిధ రకాల ప్రోత్సాహకాలపై సమీక్షించాలని నిర్ణయించగా, తాజాగా ఈ నిర్ణయం వెలువడింది. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదాలోని వారికి నెలనెలా ఇచ్చే రూ. 10 వేల ఆతిథ్య నిధిని రద్దు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలు, సైకిల్ అలవెన్స్ లను మాత్రం కొనసాగించనున్నట్టు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News