: సంజయ్ గాంధీ నా తండ్రి... సంచలన ప్రకటన చేసిన మహిళ!
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు, దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ తన తండ్రి అని ప్రియా సింగ్ పాల్ (48) అనే మహిళ చేసిన సంచలన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన ప్రియా సింగ్ పాల్ మాట్లాడుతూ, బాలీవుడ్ లో విడుదలకు సిద్దంగా ఉన్న ‘ఇందూ సర్కార్’ సినిమాలో తన తండ్రి, తన నాయనమ్మలను చెడుగా చిత్రీకరిస్తూ, చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపించారు.
ఈ సినిమాలో కేవలం 30 శాతం నిజాలుంటే, 70 శాతం అబద్ధాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. అబద్ధాలను నిజాలు అనుకునేలా సినిమాలో చూపించారని ఆమె మండిపడ్డారు. దీనిపై ఈ సినిమా దర్శకుడు మాధుర్ భండార్కర్ కు లీగల్ నోటీసులు కూడా పంపానని ఆమె తెలిపారు. పసికందుగా ఉన్న తనను షీలా సింగ్, బల్వంద్ పాల్ దంపతులు దత్తత తీసుకున్నారని, తాను.... తన తండ్రికి మేనకా గాంధీతో వివాహం జరగకముందు జన్మించిన కూతురినని తన పెంపుడు తల్లిదండ్రులు చెప్పారని ఆమె తెలిపారు.