: రెడ్‌మీ నోట్ 5ఎ ఫీచర్లు లీక్?
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ త్వరలో విడుదల చేయనున్న రెడ్ మీ నోట్ 5ఏ ఫీచర్లు లీకయ్యాయి. ఈ ఫోన్ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4 జీబీ ర్యామ్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 12,13 మెగా పిక్సల్ కెమెరాలు రెండు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఫోన్ ధర ఎంతనే విషయం తెలియలేదు.