: ప్ర‌తిక్ష‌ణం నరకం అనుభవిస్తున్నానంటూ యూపీ సీఎంకి ఓ యువతి ట్వీట్


దయచేసి తనకు న్యాయం చేయాలని, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు ఓ ద‌ళిత రేప్ బాధితురాలు చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. త‌న‌పై దారుణానికి పాల్ప‌డిన‌ నిందితులను ఇంకా శిక్షించకపోవడం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించింది. తాను ప్ర‌తిక్ష‌ణం నరకం అనుభవిస్తున్నానని తెలిపిన ఆ యువ‌తి తనపై దారుణానికి పాల్ప‌డిన వారు మాత్రం యథేచ్చగా తిరుగుతున్నారని తెలిపింది. తానో దళిత అమ్మాయినని, త‌న‌పై ఈ ఏడాది మే నెల 2వ తేదీన గ్యాంగ్‌రేప్‌ జరిగిందని ఆగ్రాకు చెందిన ఆ అమ్మాయి తెలిపింది. ఆమె ట్వీట్‌పై స్పందించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.        

  • Loading...

More Telugu News